విందు భోజనం పంపించిన ప్రభాస్.... కృతజ్ఞతలు తెలిపిన కరీనా కపూర్

26-09-2021 Sun 14:34
  • ఆదిపురుష్ లో నటిస్తున్న ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్
  • ప్రస్తుతం ముంబయిలో ఉన్న ప్రభాస్
  • సైఫ్ కుటుంబానికి బిర్యానీ, ఖీర్ పంపించిన వైనం
  • బాహుబలి పంపిన ఫుడ్ ది బెస్ట్ అవుతుందన్న కరీనా
Kareena thanked Prabhas for sending delicious biryani and kheer
ప్రభాస్ హీరోగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఆదిపురుష్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వివిధ వంటకాలు తయారు చేయించి పంపించారు. ప్రభాస్ పంపిన వంటకాల్లో స్పెషల్ బిర్యానీ, ఖీర్, నాన్ వెజ్ కర్రీ ఉన్నాయి.

ప్రభాస్ తమ పట్ల చూపిన అభిమానానికి సైఫ్ కుటుంబ సభ్యులు ముగ్ధులయ్యారు. సైఫ్ అర్ధాంగి కరీనా కపూర్ ఈ వంటకాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాహుబలి బిర్యానీ పంపిస్తే అది కచ్చితంగా ది బెస్ట్ అవుతుంది... థాంక్యూ ప్రభాస్ అంటూ కరీనా కృతజ్ఞతలు తెలిపారు.