బీజేపీ నేతపై దాడి కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు

26-09-2021 Sun 14:34
  • బీజేపీ నేత సంగమ్ లాల్ గుప్తాపై దాడి
  • కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీపై ఆరోపణలు
  • ప్రమోద్ సహా మొత్తం 26 మందిపై కేసు
Congress Ex MP booked in BJP leader attack case
బీజేపీ నేత సంగమ్ లాల్ గుప్తాపై దాడి చేసిన కేసులో కాంగ్రెస్ మాజీ నేతపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. తనతోపాటు పార్టీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారని సంగమ్ లాల్ ఆరోపించారు. ఈ ముఠాకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారి నాయకత్వం వహించారని సంగమ్ లాల్ తెలిపారు.

ఈ విషయంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 26 మందిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో తమ పార్టీ కార్యకర్తలతోపాటు తనపై కూడా కాంగ్రెస్ నేతలు దాడి చేశారని సంగమ్ లాల్ తెలిపారు.

ఈ విషయంలో తివారీతోపాటు ఆయన కుమార్తెపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఒక్క నిందితుడిని కూడా వదిలే ప్రసక్తి లేదని యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేశవ్ ప్రసాద్ మౌర్య హామీ ఇచ్చారు.