భారత్‌కు తిరిగొచ్చిన ప్రధాని మోదీ

26-09-2021 Sun 13:46
  • అమెరికాలో మూడు రోజుల పర్యటన పూర్తి
  • యూఎస్‌లో 65 గంటల్లో 20 సమావేశాలు
  • విమానంలో కూడా నాలుగు సుదీర్ఘ సమావేశాలు
modi returns to India from US
భారత ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగొచ్చారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన 65 గంటల్లో 20 సమావేశాలకు హాజరవడం గమనార్హం. విమానంలో కూడా నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పలువురు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ బిజీ షెడ్యూల్ ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది పార్టీ నేతలు మోదీకి స్వాగతం పలికారు.