Sabitha Indra Reddy: ఈ ఘ‌ట‌న చాలా బాధాక‌రం: డ్రైనేజీ గుంత‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ప‌డ్డ ఘ‌ట‌న‌పై మంత్రి స‌బిత‌

  • మణికొండలో ఘటనాస్థలిని ప‌రిశీలించిన స‌బితా ఇంద్రారెడ్డి
  • అధికారుల నిర్ల‌క్ష్యం ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌
  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని హామీ
  • నాలాల నిర్మాణం వ‌ద్ద జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న మంత్రి
sabita warn officers

హైదరాబాద్ లోని మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ప‌డి గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42) అనే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. అత‌డి కోసం నిన్న రాత్రి నుంచి రెండు 2 డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. మణికొండలో ఘటనాస్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న చాలా బాధాక‌ర‌మ‌ని అన్నారు. బాధిత కుటుంబాన్ని తాము ఆదుకుంటామ‌ని చెప్పారు. నాలాల నిర్మాణం వ‌ద్ద జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా అధికారులు అన్ని ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె చెప్పారు. అధికారులు నిర్ల‌క్ష్యంగా ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆమె హెచ్చ‌రించారు.


More Telugu News