మంత్రి పెద్దిరెడ్డిని క‌లిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా

26-09-2021 Sun 12:48
  • తిరుప‌తిలో పెద్దిరెడ్డిని క‌లిసిన రోజా
  • ఎంపీపీ ఎన్నిక‌లో త‌మ పార్టీ నేత‌ల తీరుపై ఫిర్యాదు
  • నిండ్ర ఎంపీపీ ఎన్నిక‌పై పెద్దిరెడ్డితో మాట్లాడిన రోజా
roja complaints on mptcs

తిరుప‌తిలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే రోజా క‌లిసి ఎంపీపీ ఎన్నిక‌లో త‌మ పార్టీ నేత‌ల తీరుపై ఫిర్యాదు చేశారు. నిండ్ర ఎంపీపీ ఎన్నిక‌పై పెద్దిరెడ్డితో ఆమె మాట్లాడారు. ఎంపీటీసీలు పార్టీ విప్‌ను ధిక్క‌రించార‌ని ఆమె మంత్రికి వివ‌రించారు.

రెండోసారి విప్ జారీ చేసిన‌ప్ప‌టికీ ఎంపీటీసీలు దాని ప్ర‌కారం న‌డుచుకోలేద‌ని ఆమె చెప్పారు. పార్టీ ఆదేశాల‌ను పాటించుకుండా వ్య‌తిరేక తీరు ప్ర‌ద‌ర్శించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. కాగా, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డంతో ఏపీలో ఎంపీటీసీలు ఎంపీపీల‌ను ఎన్నుకున్న విష‌యం తెలిసిందే.