IPL 2021: ఇంకెప్పుడు ఆడతాడు? కేదార్ జాదవ్‌పై మాజీ క్రికెటర్ విమర్శ

  • ఐపీఎల్ 2021‌లో ఇప్పటి వరకూ భారీ ఇన్నింగ్స్ ఆడని జాదవ్
  • ఆరు మ్యాచుల్లో కలిపి కేవలం 55 పరుగులే
  • అయినా కొనసాగుతున్న 11 మందిలో ఎంపిక
Shaun Pollock questions Kedar Jadav selection into playing eleven

ఐపీఎల్ 2021లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ స్పందించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టులో వెటరన్ ప్లేయర్ కేదార్ జాదవ్ ఎంపికను పొలాక్ ప్రశ్నించాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 6 మ్యాచులు ఆడిన ఈ హార్డ్ హిట్టర్.. కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అతనికి మంచి జీతం లభిస్తోందని, అయినా సరే ‘జాదవ్ ఎప్పుడు ఆడతాడు?’ అని ప్రశ్నించుకోవాల్సిన స్థితిలో అభిమానులు ఉన్నారని ఈ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు విమర్శించాడు. కేవలం గడిచిన మ్యాచుల్లో  ప్లేయింగ్ ఎలెవన్‌లో అతను కచ్చితంగా ఉంటున్నాడు.

కానీ ప్రదర్శన మాత్రం అత్యంత ఘోరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అతని ఎంపికను ఏ విధంగా సమర్థించుకోవాలని పొలాక్ ప్రశ్నించాడు. కాగా, పంజాబ్ కింగ్స్‌తో తాజాగా జరిగిన మ్యాచులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన సన్‌రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

More Telugu News