మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ప‌ట్టిన హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు సుచిత్.. వీడియో వైర‌ల్

26-09-2021 Sun 12:30
  • ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్
  • 15వ ఓవర్ లో జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్యాచ్
  • బ్యాట్స్‌మ‌న్‌ దీపక్ హుడా షాట్ కొట్ట‌గా బంతిని ఎగిరి ప‌ట్టిన సుచిత్
suchith mind blowing catch

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, ఇదే మ్యాచులో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ ఫీల్డర్‌ జగదీశ సుచిత్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ప‌ట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

అత‌డిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 15వ ఓవర్ లో జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మ‌న్‌ దీపక్ హుడా  షాట్ కొట్ట‌గా, బంతి వేగంగా వెళ్లింది. అది బౌండ‌రీ దాటుతుంద‌ని అంద‌రూ భావించ‌గా దాన్ని జ‌గ‌దీశ‌ సుచిత్ అద్భుతంగా క్యాచ్ ప‌ట్టి ఔరా అనిపించాడు.