ప‌లు రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా భేటీ.. హాజ‌రు కాని జ‌గ‌న్, మ‌మ‌త‌

26-09-2021 Sun 11:05
  • మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌
  • ఏపీ నుంచి సుచ‌రిత హాజ‌రు
  • ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల జ‌గ‌న్ గైర్హాజ‌రు
shah meets cms in delhi
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మావేశ‌మ‌య్యారు. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ హాజ‌రు కావాల్సి ఉండ‌గా వారు రాలేదు.

ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కావ‌ట్లేద‌ని జ‌గ‌న్ తెలిపారు. దీంతో ఏపీ నుంచి హోం మంత్రి సుచ‌రిత‌, డీజీపీ హాజ‌ర‌య్యారు. ఇందులో తెలంగాణ, యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పాల్గొంటున్నారు. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చిస్తున్నారు.

ప్ర‌స్తుతం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జ‌రుపుకుంటోంది. ఇందులో భాగంగా ఆదివాసీ యువకులను రిక్రూట్‌ చేసుకోవాలని మావోయిస్టులు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని ఇటీవ‌లే పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు ప‌లు రాష్ట్రాల్లో వారు స‌మావేశాలు జ‌రుపుతున్నార‌ని చెప్పారు. దీంతో ప‌లు రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం.