నాగ చైత‌న్య‌కు ఈ సినిమా గేమ్‌ చేంజర్‌ అవుతుంది: మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు

26-09-2021 Sun 10:45
  • లవ్ స్టోరీ' మూవీపై మ‌హేశ్ బాబు స్పంద‌న‌
  • నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న అద్భుతం
  • సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ ఎప్ప‌టిలాగే చాలా బాగుంది
mahesh babu praises naga chaitanya
నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టించిన‌ 'లవ్ స్టోరీ' మూవీపై మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారని ఆయ‌న అన్నాడు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడని, ఆయ‌న న‌టించిన తీరు చాలా బాగుందని మ‌హేశ్ బాబు చెప్పాడు.

'ల‌వ్ స్టోరీ' సినిమా నాగ చైత‌న్య‌కు గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆయ‌న ప్ర‌శంసించాడు. హీరోయిన్ సాయిపల్లవి ఎప్పటిలాగే ఈ సినిమాతోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని మ‌హేశ్ బాబు అన్నాడు. సాయి ప‌ల్ల‌వికి అసలు ఎముకలు ఉన్నాయా? అన్న సందేహం కలుగుతుందని ఆమె డ్యాన్స్‌ను మ‌హేశ్ కొనియాడాడు.  

ఆమెలా డ్యాన్స్‌ చేసేవాళ్లని  ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఈ సినిమాకు సంగీతం అందించిన ప‌వన్ సీహెచ్ సంచలనమే అని చెప్పాలని మ‌హేశ్ బాబు అన్నాడు. ఆయ‌న‌ రెహమాన్ సర్ శిష్యుడని త‌న‌కు తెలిసింద‌ని అన్నాడు. ఇది రెహ‌మాన్ స‌ర్ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యమ‌ని ఆయ‌న చెప్పాడు. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పై నిర్మాతలు కె.నారాయణ్‌దాస్‌ నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మించారు.