న్యూయార్క్ లో మోదీ బసచేసిన హోటల్ ఎదుట "భారత్ మాతా కీ జై" నినాదాలతో హోరెత్తించిన భారతీయులు

25-09-2021 Sat 21:45
  • అమెరికాలో ముగిసిన మోదీ పర్యటన
  • ఐక్యరాజ్యసమితిలో మోదీ ప్రసంగం
  • జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టుకు పయనం
  • భారత్ తిరిగిరానున్న మోదీ
Indians chants Jai Bharat Mata Ki slogans

అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. చివరగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించారు. కాగా, న్యూయార్క్ నగరంలో మోదీ బస చేసిన హోటల్ ఎదుట భారతీయుల కోలాహలం నెలకొంది. భారత్ తిరిగొచ్చేందుకు మోదీ జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయల్దేరే క్రమంలో, హోటల్ వెలుపల "భారత్ మాతా కీ జై" నినాదాలు మిన్నంటాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో గుమికూడి మోదీని కలిసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు.

ప్రధాని మోదీ వారిని నిరుత్సాహపరచకుండా, వారితో చేయి కలిపి, ఆప్యాయంగా ముచ్చటించారు. కాగా, అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పలువురికి కానుకలు ఇవ్వడం తెలిసిందే. కాగా, ఆయనకు ఈ పర్యటనలో 157 విశిష్ట కళాకృతులు కానుకల రూపంలో అందాయి. వాటన్నింటిని మోదీ భారత్ తీసుకురానున్నారు.