కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారు: మంత్రి బాలినేని

25-09-2021 Sat 19:19
  • ఒంగోలులో మీడియాతో మాట్లాడిన బాలినేని
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం
  • మంత్రి పదవి పోయినా బాధపడనని వెల్లడి
  • తనకు పార్టీయే ముఖ్యమని ఉద్ఘాటన
Balineni Vasu comments on cabinet expansion

ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదని అన్నారు.