'కొండ పొలం' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Konda Polam trailer release date fixed
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'కొండ పొలం' సినిమా రూపొందింది. 'ఉప్పెన' కంటే ముందుగా వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా ఇది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, 'కొండ పొలం' అనే నవల ఆధారంగా రూపొందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కొండప్రాంతం .. గిరిజన గూడెంలోని జీవన విధానం .. అక్కడ ఉన్న సమస్యలను కలుపుకుని సాగే అందమైన ప్రేమకథ ఈ సినిమా. లుక్స్ పరంగా వైష్ణవ్ తేజ్ .. రకుల్ ఇద్దరూ కూడా సింపుల్ మేకప్ తో కొత్తగా కనిపిస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..
Go Back to Shorts
Vaishnav tej
Rakul Preet Singh
Krish

More Telugu News