రాణించిన అయ్యర్, హెట్మెయర్... ఢిల్లీ స్కోరు 154/6

25-09-2021 Sat 17:50
  • ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
  • ఓ మోస్తరు స్కోరు చేసిన వైనం
  • విఫలమైన ఢిల్లీ ఓపెనర్లు
Rajasthan Royals Vs Delhi Capitals

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (43), షిమ్రోన్ హెట్మెయర్ (16 బంతుల్లో 28 రన్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు సాధించింది. అంతకుముందు, ఓపెనర్లు పృథ్వీ షా (10), శిఖర్ ధావన్ (8) విఫలమయ్యారు.

కెప్టెన్ రిషబ్ పంత్ 24, లలిత్ యాదవ్ 14 నాటౌట్, అక్షర్ పటేల్ 12 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, చేతన్ సకారియా 2, కార్తీక్ త్యాగి 1, రాహుల్ తెవాటియా 1 వికెట్ తీశారు.