'టక్ జగదీష్' దర్శకుడి నుంచి మరో లవ్ స్టోరీ!

25-09-2021 Sat 17:23
  • 'నిన్నుకోరి'తో లభించిన హిట్
  • 'మజిలీ' సినిమాతో మంచి గుర్తింపు
  • ఎమోషన్ ప్రధానంగా నడిచిన 'టక్ జగదీష్ '
  • వైజాగ్ బీచ్ లో కథపై కసరత్తు    
Shiva Nirvana is ready with new project

నాని కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ, 'టక్ జగదీష్' సినిమాను ఇటీవల థియేటర్లకు తీసుకొచ్చాడు. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం - అనుబంధాలు అనే అంశం చుట్టూ ఆయన ఈ కథను నడిపించాడు. కథాకథనాలు .. పాటలు పరంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

దాంతో ఆయన తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వైజాగ్ బీచ్ లో కూర్చుని కథను రాసుకుంటున్నాడు. ఈ సారి తాను ఒక లవ్ స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్టుగా శివ నిర్వాణ చెప్పాడు. సముద్రంలో కెరటాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, తాను రెడీ చేస్తున్న ప్రేమకథ అంతే స్వచ్ఛంగా ఉంటుందని అన్నాడు.

గతంలో తాను అందించిన 'నిన్నుకోరి' .. 'మజిలీ' సినిమాల మాదిరిగానే ఈ ప్రేమకథ ఉంటుందని చెప్పాడు. శివ నిర్వాణతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు .. హీరోయిన్లు చాలా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ సారి ఆయన సినిమాలో చేసే అవకాశం ఎవరికి దొరుకుతుందో చూడాలి.