CM KCR: కేంద్రమంత్రి షెకావత్ ను కలిసి లేఖ అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

  • ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
  • జల వివాదాలపై షెకావత్ తో చర్చ
  • గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • ముందు వాటాల సంగతి తేల్చాలని వినతి
CM KCR held meeting with union minister Gajendra Singh Shekawat

పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. ఈ సమావేశంలో జల వివాదాలపై పలు అంశాలను షెకావత్ కు వివరించారు. ముఖ్యంగా 5 అంశాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు.

కాగా, ఈ సమావేశంలో కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ఉంచాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని, ముందు వాటాల సంగతి తేల్చాలని, ఆ తర్వాతే బోర్డుల పని చేపట్టాలని పేర్కొన్నారు. షెకావత్ తో కేసీఆర్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది.

More Telugu News