Upasana: నాకు అత్యంత విలువైన ఫొటో ఇదే: ఉపాసన

Upasana shares a precious pic in social media
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన
  • ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న వైనం
  • ఫొటోలో తల్లిదండ్రులు, అత్తమామలు
  • మెగా అభిమానులను ఆకర్షిస్తున్న ఫొటో
మెగా ఇంటి కోడలు కొణిదెల ఉపాసన ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో తన అత్తమామలు సురేఖ, చిరంజీవిలతో పాటు తన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని కూడా ఉన్నారు. తనకు అత్యంత విలువైన ఫొటో ఇదేనని ఉపాసన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.

ఉపాసన ఓవైపు అపోలో ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులతో అలరిస్తుంటారు. రామ్ చరణ్, ఇతర మెగా కుటుంబ సభ్యుల ఫొటోలను, ముఖ్యమైన సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు.
Upasana
Pic
Precious
Parents
In Laws
Social Media

More Telugu News