‘లవ్ స్టోరీ’ సక్సెస్ పార్టీ ఇచ్చిన నాగార్జున.. ఆమిర్ ఖాన్ హాజరు, కనిపించని సమంత .. వీడియో ఇదిగో

25-09-2021 Sat 13:27
  • విజయవంతంగా నడుస్తున్న సినిమా
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్
  • వైరల్ గా మారిన ఫొటోలు
  • పార్టీలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, అఖిల్
Nag Hosts Love Story Team A Success Party Samantha Misses
‘లవ్ స్టోరీ’ ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు అక్కినేని వారి వారసుడు నాగచైతన్య. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.8.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఓపెనైన థియేటర్లకూ ఈ సినిమా మంచి ఊపుతెచ్చింది.

అయితే, సినిమా సక్సెస్ సందర్భంగా అక్కినేని నాగార్జున చిత్ర బృందానికి చిన్న పార్టీ ఇచ్చారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కేక్ కట్ చేశారు. ఆ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా హాజరయ్యారు. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా పార్టీలో పాల్గొన్నాడు. శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కూడా వచ్చారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఆ పార్టీలో సమంత ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారంటూ వార్తలు వైరల్ కావడంతో వాటిని చైతూ ఖండించాడు. మొదట్లో కొంచెం బాధపడినా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పాడు.