దుబాయ్‌లో అల్లు అర్జున్.. ఫొటో వైర‌ల్

25-09-2021 Sat 12:08
  • ప్ర‌స్తుతం 'పుష్ప' సినిమాలో న‌టిస్తోన్న బ‌న్నీ
  • ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్
  • దుబాయ్‌కి వెళ్లి అక్క‌డ ఎంజాయ్
allu arjun pic goes viral

అల్లు అర్జున్ ప్ర‌స్తుతం 'పుష్ప' సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ దొర‌క‌డంతో ఆయ‌న దుబాయ్‌కి వెళ్లి అక్క‌డ ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ వెంట ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లోని ఎత్తైన భ‌వ‌నాలు క‌న‌ప‌డేలా అల్లు అర్జున్ దిగిన ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. న‌లుపు రంగు దుస్తుల్లో, గ‌డ్డంతో ఆయ‌న ఈ ఫొటోలో క‌న‌ప‌డుతున్నాడు. పుష్ప సినిమాలో గెట‌ప్ కోసం కొన్ని నెల‌ల నుంచి బ‌న్నీ గ‌డ్డంతోనే క‌న‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. అలాగే, జుట్టు కూడా పెంచేశాడు.

కాగా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'పుష్ప' సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా తొలి పార్టు క్రిస్మ‌స్ కు విడుద‌ల కానుందని ఈ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. 'అల.. వైకుంఠపురములో' వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనా‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే  ఈ సినిమా నుంచి  టీజ‌ర్, ఓ పాట విడుద‌ల‌య్యాయి. వాటిల్లో అల్లు అర్జున్ క‌న‌ప‌డిన తీరు అల‌రించింది.