పరీక్ష రాసేందుకు వెళ్తుండగా లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు విద్యార్థులు, కారు డ్రైవర్ మృతి

25-09-2021 Sat 11:44
  • మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలు
  • రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రమాదం
  • రీట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం
Six Including Five Students Killed In Road Accident
వారంతా రీట్ (రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఫర్ టీచర్స్) ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్తున్నారు. భవిష్యత్ లో మంచి స్థానంలో ఉందామని కలలు కన్నారు. కానీ, ఆగి ఉన్న లారీ రూపంలో వారి భవిష్యత్తును మృత్యువు కబళించింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. అందులో ఐదుగురు విద్యార్థులు కాగా.. ఒకరు కారు డ్రైవర్. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జైపూర్– ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది.