దుల్కర్ సల్మాన్ సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్!

25-09-2021 Sat 11:37
  • తెలుగులో దుల్కర్ హీరోగా సినిమా
  • దర్శకుడిగా హను రాఘవపూడి
  • ఒక కథానాయికగా మృణాల్ ఠాకూర్
  • రష్యా షెడ్యూల్లో జాయిన్ కానున్న రష్మిక
 Rashmika in Dulquer Salman movie

ఒక వైపున తెలుగు .. మరో వైపున తమిళ .. హిందీ సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఒక సినిమా షెడ్యూల్ పూర్తికాగానే మరో భాషలో .. మరో లొకేషన్లో కెమెరా ముందు ప్రత్యక్షమవుతూ వరుస సినిమాలను చక్కబెడుతోంది. ఈ సుందరి స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లు అవాక్కవుతున్నారు.

ఆశ్చర్యం నుంచి వాళ్లు కోలుకునేలోగా కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసేస్తోంది. తాజాగా ఆమె దుల్కర్ సల్మాన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. స్వప్న సినిమా - వైజయంతీ మూవీస్ వారు, దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా, రీసెంట్ గా ఓకే చెప్పిందట.

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ముందుగా హైదరాబాద్ లోను .. ఆ తరువాత కాశ్మీర్ లోను షూటింగు జరుపుకుంటుందని అంటున్నారు. రష్యాలో జరిగే షెడ్యూల్లో రష్మిక జాయిన్ అవుతుందని చెబుతున్నారు. మరో ప్రధానమైన పాత్రలో మృణాల్ ఠాకూర్ అలరించనుంది.