కాకినాడ జీఎంఆర్​ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 70% సామగ్రి అగ్నికి ఆహుతి

25-09-2021 Sat 11:35
  • వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం
  • మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
  • ప్రమాద సమయంలో డ్యూటీలో తక్కువ మంది
Huge Fire Broke Out In GMR Power Plant In Kakinada

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాకినాడ తీరంలోని జీఎంఆర్ మినీ పవర్ ప్లాంట్ లో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పుతున్నారు.

పవర్ ప్లాంట్ లోని 70 శాతం వరకు సామగ్రి మంటలకు ఆహుతైనట్టు సిబ్బంది చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో సిబ్బంది తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు.