తెలంగాణ పర్వతారోహకుడికి భారీ ఆర్థిక సాయాన్ని అందించిన జగన్

25-09-2021 Sat 11:11
  • ఎవరెస్ట్ సహా ఐదు ఖండాల్లోని శిఖరాలను అధిరోహించిన తుకారామ్
  • తుకారామ్ ను అభినందించిన జగన్
  • రూ. 35 లక్షల చెక్కును అందించిన సీఎం
Jaggan gives Rs 35 lakhs to Telangana mountaineer Tukaram

సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి చెందిన వారికి సహాయం చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘటన తాజాగా జరిగింది. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారు. తుకారామ్ సాహసాలను మెచ్చుకున్న జగన్... అతనికి భారీ ఆర్థికసాయాన్ని అందించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను తుకారామ్ కలిశాడు. తన పర్వతారోహణ వివరాలను సీఎంకు వివరించాడు. ఈ సందర్భంగా తుకారామ్ ను జగన్ అభినందించారు. ఆయనకు రూ. 35 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా తుకారామ్ మాట్లాడుతూ, తనపై జగన్ చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు.