'ఖిలాడి' స్పీడు.. టాకీపార్ట్ పూర్తి!

25-09-2021 Sat 11:11
  • రమేశ్ వర్మ దర్శకుడిగా 'ఖిలాడి'
  • రవితేజ సరసన ఇద్దరు భామలు
  • వెంటనే మిగతా పనులు షురూ   
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన
Talkie part completed in Khiladi movie
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇది. ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు.

తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే మిగతా పనులను పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీగా మార్కులు కొట్టేసింది.

అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి .. ఉన్నిముకుందన్ .. రావు రమేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్న రవితేజ, నక్కిన త్రినాథరావు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.