దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

25-09-2021 Sat 10:53
  • కొత్త‌గా 29,616 క‌రోనా కేసులు
  • రిక‌వ‌రీ రేటు 97.78 శాతం
  • నిన్న క‌రోనాతో  290  మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,46,658
corona bulletin in inida
దేశంలో కొత్త‌గా 29,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి  28,046 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 97.78 శాతంగా ఉంది. నిన్న క‌రోనాతో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,658కి పెరిగింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 3,01,442 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,28,76,319 మంది కోలుకున్నారు.  కేర‌ళ‌లో నిన్న 17,983 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 71,04,051 డోసుల‌ క‌రోనా వాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 84,89,29,160 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.