ఫస్టు డే వసూళ్ల విషయంలో 'లవ్ స్టోరీ' దూకుడు!  

25-09-2021 Sat 10:39
  • నిన్న విడుదలైన 'లవ్ స్టోరీ'
  • నైజామ్ వసూళ్లు మూడున్నర కోట్లు
  • యూఎస్ లోను భారీ రెస్పాన్స్
  • ప్రపంచవ్యాప్తంగా లభించిన 8.5 కోట్ల షేర్  
Huge responce for Love Story movie
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, విడుదలకు ముందే అంచనాలు పెంచేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు .. టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి.
 
సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు ఓపెన్ చేసి చాలా రోజులే అయినా, థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కానీ ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసినా నిమిషాల్లో టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో ఉత్సాహభరితమైన వాతావరణం కనిపించింది.

తొలి రోజున పబ్లిక్ నుంచి ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా మూడున్నర కోట్ల రూపాయలను వసూలు చేసిందని చెబుతున్నారు. యూఎస్ కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఈ సినిమా తొలిరోజున 8.5 కోట్ల షేర్ ను రాబట్టిందని అధికారికంగా తెలియజేశారు.