TTD: శ్రీ‌వారి సర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల విక్ర‌యాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న

  • అర‌గంట‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఖాళీ
  • ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఇవ్వ‌డం ప్రారంభించిన టీటీడీ
  • అక్టోబ‌రు 31 వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల జారీ
  • 35 రోజుల టికెట్లు  బుక్ చేసుకున్న‌ భ‌క్తులు  
ttd tickets bookings

తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి సర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల విక్ర‌యాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అర‌గంట‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఖాళీ అయిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం టికెట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఇవ్వ‌డం ప్రారంభించింది. అక్టోబ‌రు 31 వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను జారీచేసింది. దీంతో ఆ వెంట‌నే అర‌గంట‌లోనే టికెట్ల‌న్నింటినీ భ‌క్తులు బుక్ చేసుకున్నారు.  

దీంతో అక్టోబ‌రు 31 వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల జారీ ముగిసింది. 35 రోజుల టికెట్లు కేవ‌లం 30 నిమిషాల్లోనే భ‌క్తులు బుక్ చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కాగా,  శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడంతో ఇటీవ‌ల భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే.  దీంతో శ‌నివారం నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు 9 గంట‌ల‌కు టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభించారు.

More Telugu News