సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

25-09-2021 Sat 07:24
  • చెల్లెలి పాత్రలలో కీర్తి సురేశ్ 
  • మహేశ్ కోసం భారీ ఇంటి సెట్
  • 'బంగార్రాజు' కోసం ఐటెం సాంగ్
Keerti Suresh plays sister roles in three movies
*  ఓపక్క యంగ్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే.. మరోపక్క కీర్తిసురేశ్ కొన్ని సినిమాలలో చెల్లెలి పాత్రలలో కూడా నటిస్తోంది. అలా ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలలో చెల్లిగా నటిస్తోంది. రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే', చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్', దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించే 'సానికాయిదమ్' సినిమాలలో కీర్తి చెల్లెలి పాత్రలు పోషిస్తుండడం విశేషం.
*  మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం షూటింగును నవంబర్ మొదటి వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదులో 5 కోట్ల వ్యయంతో ఓ మోడరన్ ఇంటి సెట్ ను వేస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ సెట్లోనే చిత్రీకరిస్తారట. ఇందులో పూజ హెగ్డే ప్రధాన కథానాయికగా నటిస్తుంది.
*  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగులో వేదిక, మీనాక్షి చౌదరి డ్యాన్స్ చేస్తారని సమాచారం. ఈ పాటను ఈ నెలాఖరులో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి విదితమే.