Narendra Modi: వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోదీ సమావేశం

  • అమెరికాలో మోదీ పర్యటన
  • బైడెన్, మోదీ మధ్య తొలి ద్వైపాక్షిక భేటీ
  • ఓవల్ ఆఫీసులో సమావేశం
  • కలిసి పనిచేస్తామన్న బైడెన్
Narendra Modi held meeting with POTUS Joe Biden in White House Oval Office

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమయ్యారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసు ఈ అగ్రస్థాయి భేటీకి వేదికగా నిలుస్తోంది. బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత ప్రధానితో ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం. ప్రధానంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, ఇతర సమస్యలపై కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం భాగస్వాములం అవుతామని వెల్లడించారు.

More Telugu News