సీఎం జగన్ వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు... ఢిల్లీ పర్యటన రద్దు

24-09-2021 Fri 21:01
  • సాయంత్రానికి కూడా తగ్గని నొప్పి
  • విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
  • రేపు ఢిల్లీ వెళ్లరాదని సీఎం జగన్ నిర్ణయం
  • సీఎం బదులు మేకతోటి సుచరిత ఢిల్లీ పయనం
CM Jagan Delhi tour cancelled
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. రేపు ఆయన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ, కాలు బెణకడంతో పర్యటన నిలిచిపోయింది. సీఎం జగన్ ఈ ఉదయం వ్యాయామం చేస్తుండగా, కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కాలు నొప్పి నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సీఎంకు బదులు హోంమంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుండడం తెలిసిందే.