ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి... వీడియో ఇదిగో!

  • అరుణాచల్ ప్రదేశ్ లో కిషన్ రెడ్డి పర్యటన
  • పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ప్రయాణం
  • స్వయంగా బైక్ నడిపిన వైనం
  • అరుణాచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని హామీ
Kishan Reddy bike ride in Arunachal Pradesh

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సుమారు 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. కిషన్ రెడ్డి స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడపడం విశేషం. పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ఆయన బైక్ పై ప్రయాణించారు. ప్రకృతి అందాలతో అలరారే దట్టమైన అటవీప్రాంతం గుండా కిషన్ రెడ్డి ప్రయాణం సాగింది.

అందమైన లోయలు, ఆకట్టుకునే పర్వత శ్రేణులతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News