బిగ్ సి మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు

24-09-2021 Fri 20:07
  • బిగ్ సి మొబైల్స్ కు కొత్త ప్రచారకర్త
  • మహేశ్ బాబుతో బిగ్ సి ఒప్పందం
  • హైదరాబాదులో ప్రెస్ మీట్
  • ఇప్పటివరకు బిగ్ సి సంస్థకు హీరోయిన్లు ప్రచారం చేసిన వైనం
Mahesh Babu as Big C brand ambassador
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బిగ్ సి మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బిగ్ సి సంస్థ మహేశ్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేశ్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కాగా, బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు అంబాసిడర్లుగా వ్యవహరించింది హీరోయిన్లే కాగా, ఇప్పుడు మహేశ్ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఇదే ప్రశ్నను ఓ మీడియా ప్రతినిధి మహేశ్ బాబును ప్రశ్నించగా, బిగ్ సి అంబాసిడర్ స్థానాన్ని మహిళల నుంచి కొట్టేశానని భావించడం లేదంటూ చమత్కరించారు. బిగ్ సితో కలిసి నడవనుండడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.