తాత అయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

24-09-2021 Fri 18:28
  • కుమారస్వామి కుమారుడు నిఖిల్ దంపతులకు మగబిడ్డ జననం
  • విషయం తెలియగానే ఆసుపత్రికి వెళ్లిన కుమారస్వామి
  • గత ఎన్నికల్లో సుమలత చేతిలో ఓడిపోయిన నిఖిల్
Kumaraswamy became grand father

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తాత అయ్యారు. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి, రేవతి దంపతులకు ఈరోజు పండంటి మగ బిడ్డ జన్మించాడు. గత ఏడాది వీరిద్దరికీ వివాహం జరిగింది. తన కుమారుడికి కొడుకు పుట్టాడనే వార్త తెలియగానే కుమారస్వామి, ఆయన భార్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. సంబరంలో మునిగిపోయారు.

యావత్ దేశం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు నిఖిల్ వివాహం జరిగింది. ఆ వివాహానికి అత్యంత సన్నిహితులైన 100 మంది హాజరయ్యారు. అయితే ఇంత మంది హాజరుకావడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి... సుమలత అంబరీష్ చేతిలో ఓటమిపాలయ్యారు.