'రాకెట్రీ' రిలీజ్ పై స్పందించిన మాధవన్!

24-09-2021 Fri 18:20
  • 'రాకెట్రీ' ఓ ప్రత్యేకమైన సినిమా
  • ఎన్నో కష్టాలుపడి చేసిన సినిమా  
  • మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోలేదు
  • దేశ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకున్నాకే రిలీజ్
Rocketry movie update

తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా మాధవన్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య ఆయన ఒక వైపున హీరో పాత్రలు చేస్తూనే, మరో వైపున విలన్ పాత్రలను చేస్తున్నాడు. 'రాకెట్రీ' అనే సినిమాకి దర్శక నిర్మాతగాను వ్యవహరించాడు. రాకెట్ సైన్స్ లో ఎంతో పరిజ్ఞానాన్ని సాధించిన నంబి నారాయణ్ జీవితచరిత్ర ఇది.

ఈ సినిమాలో మాధవన్ పాత్ర పరంగా కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. కానీ సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అయోమయానికి గురిచేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయాన్ని గురించి మాధవన్ స్పందించాడు.

'రాకెట్రీ' సాధారణమైన సినిమా కాదు .. ఒక ప్రత్యేకత ఉన్న సినిమా. ఎంతో వ్యయప్రయాసలను ఓర్చుకుని చేసిన సినిమా. అన్ని ప్రాంతాలవారిని కదిలించే కథ ఉన్న సినిమా. అలాంటి సినిమాను ప్రతికూల పరిస్థితుల్లో ఎలా రిలీజ్ చేస్తాము? మహారాష్ట్రలో ఇంకా థియేటర్లు తెరవనేలేదు. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకున్న తరువాతనే ఈ సినిమాను విడుదల చేస్తాము" అని స్పష్టం చేశాడు.