కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును నమ్మలేదు: సజ్జల

24-09-2021 Fri 18:14
  • పరిషత్ ఎన్నికల్లో 98 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచింది
  • దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు
  • చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవచ్చు
Kuppam voters also didnt believed Chandrababu says Sajjala

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని... 98 శాతానికి పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమని చెప్పారు. ఈ ఫలితాలతో తమపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో 69.55 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 64.8 శాతం ఓట్లు తమకు వచ్చాయని తెలిపారు. చివరకు కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును నమ్మలేదని అన్నారు.

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాలు మన దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్పవచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్న తప్పుడు విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. పదవుల కేటాయింపుల్లో అన్ని వర్గాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వైసీపీ నేతలందరూ ఎంతో క్రమశిక్షణతో ఉన్నారని చెప్పారు. ఎల్లో మీడియా, ప్రతిపక్ష నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు.