ఏపీలో 14,200 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ నిర్ణయం

24-09-2021 Fri 17:24
  • రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పన
  • వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు సీఎం ఆమోదం
  • అక్టోబరు నుంచి నియామక ప్రక్రియ
  • నవంబరు 15తో ముగియాలన్న సీఎం జగన్
CM Jagan decides to conduct huge recruitment drive in health and medical department

రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పనకు సీఎం జగన్ సంకల్పించారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ఆమోదం తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ స్థాయిల్లో 14,200 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి, నవంబరు 15 నాటికి ముగించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండరాదని అన్నారు.