'ఉప్పెన' ఎఫెక్ట్ .. కృతి శెట్టికి భారీ పారితోషికం!

24-09-2021 Fri 17:10
  • సూపర్ హిట్ కొట్టిన 'ఉప్పెన'
  • కృతి శెట్టికి విపరీతమైన క్రేజ్
  • వరుస సినిమాలతో బిజీ
  • హిందీ నుంచి భారీ ఆఫర్
Big Offer for Krithi Shetty for Bollywood

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి ఒకరు. 'ఉప్పెన' సినిమాతో ఈ బ్యూటీ కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత కృతి డేట్లు దొరకడం కష్టమేనని చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్లో అన్నారు. అక్షరాలా ఇప్పుడు ఆయన అన్నట్టుగానే జరుగుతోంది.

'ఉప్పెన' సినిమాకి 25 లక్షల లోపు పారితోషికం తీసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత నాని .. సుధీర్ బాబు సినిమాలకి కూడా కాస్త అటు ఇటు గానే పారితోషికం తీసుకుందట. ఆ తరువాత చైతూతో చేస్తున్న 'బంగార్రాజు' .. నితిన్ జోడీగా చేస్తున్న 'మాచర్ల నియోజక వర్గం' సినిమా కోసం ఆమె తన పారితోషికాన్ని 50 లక్షలకు తీసుకెళ్లిందట.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో 'ఉప్పెన'ను రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే ఆ సినిమాలో కూడా కృతి శెట్టినే తీసుకోవాలని చూస్తున్నారట. కోటి రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృతి శెట్టిని తీసుకోవాలంటే ఏడాది పాటు వెయిట్ చేయవలసిందే. మరి హిందీ మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.