మగాడిలా ఉన్నావ్ అన్న విమర్శలపై తాప్సీ స్పందన

24-09-2021 Fri 16:38
  • 'రష్మీ రాకెట్' సినిమాలో అథ్లెట్ గా నటించిన తాప్సీ
  • ఆమె శరీరాకృతిపై విమర్శలు గుప్పిస్తున్న కొందరు నెటిజన్లు
  • ట్రోల్స్ ను కాంప్లిమెంట్స్ గా తీసుకుంటానన్న తాప్సీ
Tapsee responds on trolls about her body

ఢిల్లీ భామ తాప్పీ నటించిన 'రష్మీ రాకెట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో అథ్లెట్ గా కనిపించేందుకు తాప్సీ శారీరకంగా ఎంతో శ్రమించింది. పలు వ్యాయామాలు చేసి ఫుల్ ఫిట్ గా మారింది.

అయితే, కొందరు నెటిజెన్లు మాత్రం ఆమె చేసిన కృషిని మెచ్చుకోకుండా... ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ట్రైలర్ చూసిన కొందరు నెటిజెన్లు 'మగాడిలా ఉన్నావ్' అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె శరీరాకృతి గురించి వెటకారంగా మాట్లాడుతున్నారు.

ఈ వ్యాఖ్యలపై తాప్సీ చాలా కూల్ గా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్ పై ఆమె స్పందిస్తూ... ఇలాంటి ట్రోలింగ్స్ ను తాను కాంప్లిమెంట్స్ గా తీసుకుంటానని చెప్పింది. తాను ఎంతో చెమటోడ్చి, వ్యాయామాలు చేసి అథ్లెట్ లుక్ ను సాధించానని తెలిపింది. తన బాడీని చూసి మగాడివంటూ కామెంట్లు చేయడం తనకు ఒక ప్రశంస వంటిదేనని చెప్పింది.