India: భారత మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం టాటా, ఎయిర్ బస్ భారీ డీల్!

TATA Advanced Systems and Space Spain in to contract to manufacture C295 aircrafts for Indian Army
  • 56 సీ-295 విమానాల కోసం భారత రక్షణశాఖ, స్పేస్ స్పెయిన్ ల మధ్య ఒప్పందం
  • తొలి 16 విమానాలను భారత్ కు అందించనున్న ఎయిర్ బస్
  • మిగిలిన 40 విమానాలను ఇండియాలోనే తయారు చేయనున్న టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్
రక్షణ రంగానికి అవసరమైన సీ-295 రవాణా విమానాలకు సంబంధించి భారత రక్షణ శాఖ, స్పేస్ స్పెయిన్ సంస్థల మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ రూ. 20 వేల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం కింద భారత్ రక్షణశాఖకు 56 విమానాలు అందనున్నాయి. సీ-295 విమానాలు పాత ఏవీఆర్వో-748 విమానాల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.

ఈ డీల్ ప్రకారం తొలి 16 విమానాలను ఎయిర్ బస్ సంస్థ భారత్ కు అందజేస్తుంది. ఆ తర్వాత మిగిలిన 40 విమానాలను ఇండియాలోనే టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తయారు చేస్తుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఇండస్ట్రియల్ పార్టనర్ షిప్ కింద ఇండియాలోనే వీటిని తయారు చేస్తుంది.

ఈ సందర్భంగా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ, ఎయిర్ బస్ డిఫెన్స్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థల మధ్య కుదిరిన ఈ జాయింట్ ప్రాజెక్ట్ ఒప్పందం భారత్ లోని ఏవియేషన్, ఏవియానిక్స్ ప్రాజెక్టులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ ను భారత్ లోనే పూర్తి స్థాయిలో తయారు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
India
Defence Ministry
TATA Advanced Systems
Space Spain
Airbus
C 295

More Telugu News