PV Sindhu: దీపికా పదుకొణె పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యుండేది.. పొగడ్తలతో ముంచెత్తిన పీవీ సింధు

PV Sindhu And Deepika Played Badminton Together
  • ఇటీవల గేమ్ ఆడిన దీపిక, సింధు
  • ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన దీపిక
  • మంచి కెరీర్ ఉండేదన్న సింధు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెపై బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పొగడ్తల వర్షం కురిపించింది. బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకుని ఉంటే దీపిక పెద్ద ప్లేయర్ అయ్యుండేదని కామెంట్ చేసింది. ఇటీవల దీపిక, సింధు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. దానికి సంబంధించిన వీడియోలను దీపిక తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసింది. ఎవరు గెలిచారో చెప్పుకోండి చూద్దామంటూ పోస్ట్ పెట్టింది.


పీవీ సింధు వరల్డ్ చాంపియన్ షిప్ కోసం ప్రాక్టీస్ చేస్తోందని, చాంపియన్ షిప్ కు సిద్ధమయ్యేందుకు తానే సరైన భాగస్వామి అని భావించిందని దీపిక కామెంట్ చేసింది. ఇటు సింధు కూడా దీపికను పొగిడింది. బ్యాడ్మింటన్ లోకి దీపిక వచ్చి ఉంటే కనుక విజయవంతమయ్యేదని వ్యాఖ్యానించింది. టాప్ ప్లేయర్ గా ఎదిగేదని కామెంట్ చేసింది. కాగా, పీవీ సింధు, దీపికా పదుకొణె మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇటీవల రణ్ వీర్ సింగ్ తో కలిసి వారిద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు.
PV Sindhu
Deepika Padukone
Badminton
Bollywood

More Telugu News