Andhra Pradesh: హోం మంత్రిపై కామెంట్ల ఫలితం.. అయ్యన్నపాత్రుడుపై మరో కేసు

Guntur Police Booked Ayyanna Patrudu Under SC ST Atrocities Act
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు
  • లాయర్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. ఇటీవల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్, మంత్రులు, ఇతర నేతలను ఉద్దేశించి అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హోం మంత్రి సుచరితకు ఇప్పుడు కనీసం ఎస్సై అయినా సెల్యూట్ చేస్తారా? అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే నకరికల్లు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.

తాజాగా గుంటూరులోని అరండల్ పేట పోలీసులూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. హోం మంత్రిపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేముల ప్రసాద్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు బుక్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Ayyanna Patrudu
Mekathoti Sucharitha
YSRCP
Police
Guntur District

More Telugu News