Annavaram: సరుకుల ధరలు మోత.. అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం ధర పెంపు

Annavaram satyadeva prasadam rate hiked
  • ప్రస్తుతం రూ. 15గా ఉన్న ప్రసాదం ధర రూ. 20కి పెంపు
  • రూ. 200 టికెట్ భక్తులకు ఇకపై గోధుమనూక ప్రసాదం
  • నిర్ణయించిన దేవస్థానం ధర్మకర్తల మండలి
ప్రసాదానికి ఉపయోగించే సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అన్నవరం ప్రసాదం ధరను పెంచుతూ దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 100 గ్రాముల సత్యనారాయణస్వామి బంగీ ప్రసాదాన్ని (గట్టి ప్రసాదం) 15 రూపాయలకు విక్రయిస్తుండగా దానిని ఇప్పుడు రూ. 20కి పెంచింది. అలాగే, రూ. 200 టికెట్ ద్వారా స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా ఇస్తున్న 150 గ్రాముల బంగీ ప్రసాదం స్థానంలో ఇకపై అంతే బరువున్న గోధుమనూక ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
Annavaram
Lord Satyadeva
Prasadam
Andhra Pradesh

More Telugu News