వాషింగ్టన్ లో వరుస భేటీలతో ప్రధాని మోదీ బిజీ

23-09-2021 Thu 20:47
  • మోదీ అమెరికా పర్యటన
  • వాషింగ్టన్ లో పలువురితో సమావేశాలు
  • మోదీని కలిసిన టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలు
  • డిజిటిల్ ఇండియా దిశగా ఆసక్తికర చర్చలు
Modi busy in US tour

అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. డిజిటల్ ఇండియా సాకారం దిశగా ఆయన కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు. వాషింగ్టన్ లో ఇవాళ మోదీ... అడోబ్ సీఈవో శంతను నారాయణ్, క్వాల్ కామ్ సీఈవో క్రిస్టియానోl ఇ అమోన్, వివేక్ లాల్ (జనరల్ అటామిక్స్), మార్క్ విడ్మార్ (ఫస్ట్ సోలార్), స్టీఫెన్ ఏ ష్వార్జ్ మాన్ (బ్లాక్ స్టోన్)లతో సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాలకు వాషింగ్టన్ లోని ద విల్డార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వేదికగా నిలిచింది. భారత్ లో 5జీ సేవలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన అంశాలపై మోదీ వారితో చర్చించారు. ఈ చర్చలు దాదాపుగా ఫలప్రదంగా సాగినట్టు భారత దౌత్య వర్గాలు తెలిపాయి.