ఐపీఎల్: టాస్ గెలిచి ముంబయికి బ్యాటింగ్ అప్పగించిన కోల్ కతా

23-09-2021 Thu 19:44
  • ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ కోల్ కతా
  • టాస్ ఓడిన ముంబయి
  • 2 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 8 రన్స్
  • క్రీజులో రోహిత్, డికాక్
Toss won by KKR against Mumbai Indians

ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (7 బ్యాటింగ్), క్వింటన్ డికాక్ (1 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ముంబయి జట్టులో అన్మోల్ స్థానంలో సౌరభ్ తివారీని తీసుకున్నారు.