ఈరోజు చాలా సంతోషంగా ఉంది: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశంసలు

23-09-2021 Thu 18:45
  • కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం
  • ఇతర దేశాల కంటే భారత్ ఎంతో బాధ్యతగా వ్యవహరించిందన్న సుప్రీంకోర్టు
  • బాధితుల కన్నీటిని తుడవడానికి ఎంతో కొంత ప్రయత్నం జరుగుతోందని ప్రశంస
Today we are very happy says Supreme Court

కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఇతర దేశాల కంటే భారత్ ఎంతో బాధ్యతగా వ్యవహరించిందని ప్రశంసించింది. కరోనా బాధిత కుటుంబాల పట్ల కేంద్రం తీసుకున్న బాధ్యత చాలా గొప్పదని... ఈరోజు తాము చాలా సంతోషంగా ఉన్నామని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు.

బాధితుల కన్నీటిని తుడవడానికి ఎంతో కొంత ప్రయత్నం జరుగుతోందని ప్రశంసించారు. అత్యంత ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పని చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, ఇతర సమస్యలు ఉన్నా... వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేసిందని కొనియాడింది.