Saluri Rajeev: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న వాణి విశ్వనాథ్ కూతురు!

Varsha Vishwanath introduced as a new Heroine
  • తెలుగు తెరపైకి మరో ప్రేమ కథ
  • వైజాగ్ లో జరుగుతున్న షూటింగు
  • హీరోగా కోటి తనయుడి పరిచయం
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ    
టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం హీరోయిన్లలో వాణి విశ్వనాథ్ ఒకరు. తెలుగులో ఆమె చాలా సినిమాలు చేసినప్పటికీ, 'కొదమ సింహం' .. 'ఘరానా మొగుడు' మరిచిపోలేని సినిమాలుగా కనిపిస్తాయి. పదేళ్ల పాటు హీరోయిన్ గా కొనసాగిన ఆమె ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు.

ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన 'జయ జానకి నాయక' సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె తన కూతురు వర్ష విశ్వనాథ్ ను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఒక ప్రేమకథా చిత్రంలో వర్ష విశ్వనాథ్ చేస్తోంది. గాజుల వీరేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కిట్టూ నల్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు 'కోటి' తనయుడు సాలూరి రాజీవ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్టు షెడ్యుల్ షూటింగును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు వైజాగ్ లో జరుగుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, ప్రేమకథా నేపథ్యంలో నడుస్తుంది.
Saluri Rajeev
Varsha
Manisharma

More Telugu News