ఏపీలో కొత్తగా 1,171 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

23-09-2021 Thu 17:34
  • తూర్పుగోదావరి జిల్లాలో 255 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,749
Andhra Pradesh registers 1171 new Corona cases in 24 hours
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,171 కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 255 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 6 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు.

ప్రస్తుత కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,43,244కి పెరిగాయి. ఇప్పటి వరకు 20,15,387 మంది కోలుకోగా... 14,108 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 యాక్టివ్ కేసులు ఉన్నాయి.