'మా'లో మరో వివాదం... జీవితపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన నటుడు పృథ్వీ

23-09-2021 Thu 17:28
  • వచ్చే నెలలో మా ఎన్నికలు
  • ఎన్నికల అధికారికి లేఖ రాసిన పృథ్వీ
  • జీవిత మా సభ్యులను మభ్యపెడుతున్నారని ఆరోపణ
  • నిబంధనలు అతిక్రమిస్తున్నారని ఫిర్యాదు 
Actor Pridhviraj complains on Jeevitha
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో వివాదం ఏర్పడింది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడం కలకలం రేపింది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని జీవిత చెబుతున్నారని పేర్కొన్నారు. జీవిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, జీవిత మా ఎన్నికల్లో  ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేస్తుండగా, మంచు విష్ణు ప్యానెల్లో ఉన్న పృథ్వీరాజ్ మా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మంచు విష్ణు ఇవాళ తన ప్యానెల్ ను ప్రకటించడం తెలిసిందే.