నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను... త్వరలోనే వస్తా: ఎమ్మెల్యే సీతక్క

23-09-2021 Thu 16:31
  • కొన్నిరోజుల కిందట ఆసుపత్రిపాలైన సీతక్క
  • దండోరాయాత్రలో అస్వస్థతకు గురైన వైనం
  • కోలుకున్న సీతక్క
  • ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ అంటూ ట్వీట్
MLA Seethakka says she doing fine
ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన దండోరా యాత్ర సందర్భంగా సొమ్మసిల్లి పడిపోయిన సీతక్కను కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో సీతక్క ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. సమస్యలపై త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తానని పేర్కొన్నారు.

"నా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ దేశవ్యాప్తంగా సందేశాలు వచ్చాయి. చాలామంది నన్ను స్వయంగా పరామర్శించి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొన్నారు.