Pawan Kalyan: ఏపీ పరిస్థితి ఇదేనంటూ పవన్ కల్యాణ్ 'స్నాప్ షాట్'

  • రాష్ట్ర పరిస్థితిపై పవన్ వినూత్న స్పందన
  • సమస్యలు, వివాదాలు, కుంభకోణాలతో కూడిన స్నాప్ షాట్
  • ట్విట్టర్ లో పంచుకున్న జనసేనాని
  • అనేక అంశాలను ఎత్తిచూపే ప్రయత్నం
Janasena party chief Pawan Kalyan shares a snap shot on AP state condition

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రస్తుత పరిస్థితిపై వినూత్న రీతిలో స్పందించారు. రాష్ట్ర పరిస్థితిపై ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వివాదాలు, కుంభకోణాలు, వైఫల్యాలకు సంబంధించిన శీర్షికలను పవన్ తన స్నాప్ షాట్ లో పొందుపరిచారు.

అబద్ధాలు, రాజకీయ ప్రతీకారం, ప్రజాధనం దుర్వినియోగం, మరో వెనిజులా, అక్రమ ఇసుక తవ్వకాలు, యువతను వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగాల్లేవు... గ్రూప్ 1, గ్రూప్ 2లో కేవలం 36 పోస్టులే, జగన్ యువతను మోసం చేశారు, అప్పుల ఆంధ్రప్రదేశ్, వైసీపీ నుంచి ఏపీని కాపాడండి, లిక్కర్ మాఫియా, మటన్ దుకాణాలు, సినిమా టికెట్లు, ఆంధ్రాను అమ్మేస్తున్నారు, పర్యావరణ విధ్వంసాన్ని ఆపండి, దివీస్ ల్యాబ్స్ నుంచి తొండంగిని కాపాడండి, జీవోలపై సెన్సార్ షిప్, క్రైమ్ రేట్ లో పెరుగుదల, స్టీల్ ప్లాంట్ ను కాపాడండి, టాయిలెట్లపై పన్ను, దళితులపై దాడులు, బూమ్ బూమ్... ప్రెసిడెంట్ మెడల్ మద్యం బ్రాండ్లు, విద్యుత్ చార్జీల మోత, బెట్టింగులు వంటి అంశాలను పవన్ తన స్నాప్ షాట్ లో ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

More Telugu News