బెంగ‌ళూరులో ఓ భ‌వనంలో పేలుడు... ముగ్గురి మృతి

23-09-2021 Thu 13:33
  • వీవీ పురం పోలీస్ స్టేష‌ను ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • మరికొంద‌రికి గాయాలు
  • పంక్చ‌ర్ షాప్‌లోని కంప్రెస‌రే పేలుడుకు కార‌ణం?  
blast in Bangalore

బెంగ‌ళూరులోని వీవీ పురం పోలీస్ స్టేష‌ను ప‌రిధిలోని చామ‌రాజ‌పేట‌లోని ఓ భ‌వనంలో పేలుడు సంభ‌వించి ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఆ మృత‌దేహాలు తునాతున‌క‌ల‌య్యాయి. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో మరికొంద‌రికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, ఇత‌ర స‌హాయ‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని గాయ‌ప‌డ్డ వారిని విక్టోరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

భ‌వ‌నంలో పేలుడు ఎందుకు సంభ‌వించింద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, పంక్చ‌ర్ షాప్‌లోని కంప్రెస‌రే పేలుడుకు కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పంక్చ‌ర్ షాప్ య‌జ‌మాని అస్లాం కూడా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడుకి భ‌య‌పడిపోయిన స్థానికులు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు.